Sreeleela : తాజాగా శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి.. కామెంట్స్ వైరల్!

by Disha Web Desk 9 |
Sreeleela : తాజాగా శ్రీలీల జాతకం చెప్పిన వేణుస్వామి.. కామెంట్స్ వైరల్!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం అగ్ర హీరోల సరసన నటిస్తూ.. వరుస సినిమాలతో దూసుకెళ్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోన్న ఈ భామ గురించి వేణుస్వామి తాజాగా జోస్యం చెప్పారు. ‘‘శ్రీలీల సక్సెస్‌ ఫుల్‌గా సినీ ఇండస్ట్రీలో ప్రయాణం కొనసాగుతోంది. టాప్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుని, మరో మైలురాయిని చేరుకోబోతుంది. ఆమెది మీనరాశి. ఆమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉంది. ఈ రాజయోగానికి పెద్ద పేరు తెచ్చే యోగం ఉంది.

పేరు పెరిగే కొద్దీ ధన ప్రవాహం కూడా పెరుగుతుంది. 2028 వరకు శ్రీలీల టాలీవుడ్‌లో పెద్ద స్టార్ అయిపోతుంది. మంచి నటిగా, లేడీ సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార.. గత పదేళ్లుగా స్టార్ నటిగా సినిమాల్లో రాణిస్తుంది. టాలీవుడ్ టాప్ నటీమణులుగా గుర్తింపు తెచ్చుకున్న సమంత, రష్మిక మందన్న, పూజా హెగ్డేలాగా శ్రీలీల కూడా మంచి పేరు తెచ్చుకోనుందని, వేణు స్వామి శ్రీలీల జోస్యం చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఇది నెట్టింట హాట్ టాపిక్‌గా మారుతోంది.

Also Read: Samantha జీవితం అలాగే ఉంటుందంటూ రెండో పెళ్లిపై సంచలన నిజాలు బయటపెట్టిన Venu Swamy..!

Next Story

Most Viewed