‘అరి’ ట్రైలర్‌పై అశ్వనీదత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఫీలింగ్ కలిగిందంటూ

by Disha Web Desk 7 |
‘అరి’ ట్రైలర్‌పై అశ్వనీదత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఫీలింగ్ కలిగిందంటూ
X

దిశ, సినిమా : ఆర్.వీ.రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించిన చిత్రం ‘అరి’. మై నేమ్ ఈజ్ నో బడీ అనే ఉపశీర్షికతో వస్తున్న సినిమాకు జయశంకర్ దర్శకత్వం వహించాడు. అయితే ఇటీవల విడుదలైన ట్రైలర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు సినిమాను ఉద్దేశించి మాట్లాడిన ఆయన..

'ఈ ట్రైలర్ చూడగానే చాలా ఇంప్రెస్ అయ్యాను. నాలో తెలియని పులకింత వచ్చేసింది. టెక్నిషియన్స్ అంతా కలిసి వందశాతం బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారనిపిస్తోంది. మంగ్లీ పాడిన పాట కూడా చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నా. టీమ్ అందరికీ అడ్వాన్స్‌గా కంగ్రాట్స్’ అని చెప్పారు. ఇక అశ్వనీదత్‌కు దర్శక నిర్మాతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయగా.. ఇందులో అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్ తదితరులు నటించారు.

Next Story

Most Viewed