ఆమెతో ఎంతో ట్రై చేశా కానీ సెట్ కాలే.. అందుకే విడిపోయాం.. విడాకులపై నటుడు కామెంట్

by Disha Web Desk 7 |
ఆమెతో ఎంతో ట్రై చేశా కానీ సెట్ కాలే.. అందుకే విడిపోయాం.. విడాకులపై నటుడు కామెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆశిష్ విద్యార్థి తాజాగా రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై మొదటి భార్య సైతం స్పందించి.. ఎమోషనల్ అవుతూ.. ‘‘ఇంతకాలం నువ్వు స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇక అందరి ఆశీర్వాదం తీసుకునే సమయం వచ్చింది’’ అంటూ పోస్ట్ చేశారు. అయితే.. ఆమె రెండో భార్యకు విడాకులు ఎందుకు ఇచ్చారు అనే విషయంపై ఆయన స్పందించారు.

‘‘నా మొదటి భార్యతో 22 సంవత్సరాలు జీవితాన్ని గడిపిన తర్వాత విభేదాల కారణంగా మేము విడాకులు తీసుకున్నాము. ఆ కాలంలో మా వివాహం ఎంతో గొప్పది. మేము మా మధ్య వచ్చిన అభిప్రాయబేధాలను పరిష్కరించడానికి ఎంతో ట్రై చేశాము. కానీ సమస్యలు తీరలేదు. దీంతో ఇద్దరిలో ఎవరో ఒకరు అసంతృప్తితో ఉండేవాళ్లం. ఇక విడిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈ నిర్ణయం ఇద్దరం కలిసే తీసుకున్నాం. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి:

60 ఏళ్ల వయసులో మళ్లీ పెళ్లి చేసుకున్న సీనియర్ నటుడు.. ఫొటోస్ వైరల్

33 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకున్న 60 ఏళ్ల నటుడు.. ఆయన చాలా స్ట్రాంగ్ అంటూ మొదటి భార్య షాకింగ్ రియాక్షన్

Next Story

Most Viewed