ఎట్టకేలకు ప్రియుడితో ఏడడుగులు వేసిన ‘అరుంధతి’ నటి.. వావ్, సూపర్ అంటూ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘అరుంధతి’(Arundhati ).

ఎట్టకేలకు ప్రియుడితో ఏడడుగులు వేసిన ‘అరుంధతి’ నటి.. వావ్, సూపర్ అంటూ కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియెంటెడ్ చిత్రం ‘అరుంధతి’(Arundhati ). ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇందులో నటించిన నటీనటులకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా అనుష్క చిన్నప్పటి పాత్రలో నటించిన దివ్య నగేష్‌(Divya Nagesh)కు ఊహించని విధంగా క్రేజ్ వచ్చింది. జేజమ్మ పాత్రలో నటించిన దివ్య తన నటనతో అందరినీ ఫిదా అయ్యేలా చేసింది. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ నటించి మెప్పించింది. పెద్దయిన తర్వాత ఇండస్ట్రీకి దూరం అయింది. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫొటోలను షేర్ చేస్తూ.. అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇక దివ్య పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఇటీవల ఆమె ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. గత కొద్ది కాలంగా అజయ్ కుమార్‌తో ప్రేమలో ఉన్న దివ్య పెద్దలను ఒప్పించుకుంది. అలాగే బ్యాచ్‌లర్ పార్టీ కూడా చేసుకుంది. తాజాగా, దివ్య, అజయ్ కుమార్ పెళ్లి ఘనంగా ఆగస్టు 18న జరిగింది. ఈ వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరగ్గా.. దివ్య ప్రియుడితో మూడు ముళ్లు వేయించుకుని ఏడడుగులు వేసింది. ఇక ఈ వివాహానికి బంధువులు, స్నేహితులు, పలువురు సినీ సెలబ్రిటీలు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. ఇక దివ్య పెళ్లి ఫొటోలను షేర్ చేయనప్పటికీ.. నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు కొత్త జంటకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story