తమిళ నటుడి కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి!

by Bhoopathi Nagaiah |

సీనియర్ హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతుంది.

తమిళ నటుడి కొడుకుతో అర్జున్ కూతురు పెళ్లి!
X

దిశ, సినిమా: సీనియర్ హీరో అర్జున్ పెద్ద కూతురు ఐశ్వర్య ఎట్టకేలకు పెళ్లిపీటలెక్కబోతుంది. ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతిని ఐశ్వర్య పెళ్లాడబోతుందట. ఉమాపతి కూడా నటుడే కాగా.. ఐశ్వర్య తమిళంలో కొన్ని సినిమాల్లోనూ నటించింది. అయితే ఉమాపతితో ఐశ్వర్య పీకల్లోతు ప్రేమలో ఉందంటూ చాలారోజులుగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇక తాజాగా వీరి పెళ్లికి అర్జున్ కూడా పచ్చజెండా ఊపడంతో త్వరలోనే నిశ్చితార్థం జరగనుందని, పెళ్లి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది. అయితే కూతురును స్టార్ హీరోయిన్‌గా మార్చడానికి అర్జున్ చాలా ప్రయత్నాలు చేసినప్పటికి ఫలించలేదు. దీంతో ఇక పెళ్లిచేసుకోవాలని ఐశ్వర్య నిర్ణయించుకున్నట్లు సమాచారం.

Next Story