నీలాంటి ఆడవాళ్లే భారతీయ యువతను చెడగొడుతున్నారు.. నటి ప్రెగ్నెన్సీపై విమర్శలు

by Prasanna |
నీలాంటి ఆడవాళ్లే భారతీయ యువతను చెడగొడుతున్నారు.. నటి ప్రెగ్నెన్సీపై విమర్శలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ గర్ల్‌ఫ్రెండ్ గాబ్రియెల్లా పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ మేరకు మరో నెల రోజుల్లో బిడ్డకు జన్మనివ్వబోతున్న బ్యూటీ.. లేటెస్ట్ బేబీ బంప్ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తూ మురిసిపోయింది. అంతేకాదు బంప్‌లోనూ అందమైన రూపాన్ని చూపించడం అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఆ పిక్స్ వైరల్ అవుతుండగా ఆమె ప్రవర్తనపై కొంతమంది నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ‘ఇది మీరు పుట్టిన ప్రదేశం కాకపోయినా భారతదేశంలో హాయిగా ఉంటున్నారు. అయినా మాకేమీ ఇబ్బంది లేదు. కానీ, మీరు యువత మనస్తత్వాన్ని పాడు చేయడం మాకు నచ్చలేదు’ అంటూ ఓ ఫాలోవర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో వెంటనే స్పందించిన గాబ్రియెల్లా.. ‘అవును నిజంగానే మీ మనస్తత్వం చెడిపోయింది. ఎందుకంటే అందమైన వాళ్లను ఈ ప్రపంచంలోకి స్వాగతించడాన్ని తప్పుగా భావిస్తున్నారు. మీది చాలా చిన్న మనస్తత్వమే’ అంటూ కౌంటర్ ఇచ్చింది.Next Story

Most Viewed