OGలో పవన్ కళ్యాణ్ ఒక అగ్ని తుఫాన్‌లా కనిపిస్తాడు.. ఎలివేషన్ సీన్స్‌ పిచ్చెక్కిస్తాయి..

by Disha Web Desk 9 |
OGలో పవన్ కళ్యాణ్ ఒక అగ్ని తుఫాన్‌లా కనిపిస్తాడు.. ఎలివేషన్ సీన్స్‌ పిచ్చెక్కిస్తాయి..
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో రాబోతున్న OG సినిమాలో అర్జున్ దాస్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్న ఆయన.. మూవీ గురించి చేసిన ట్వీట్ పవన్ అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. పవర్‌ స్టార్‌కు సంబంధించిన కొన్ని విజువల్స్ దర్శకుడు తనకు చూపించాడని.. ఆయన స్క్రీన్ ప్రజెన్స్, స్వాగ్, డైలాగ్స్ ఫైర్ అని చెప్పుకొచ్చాడు. నిజంగా OG రూపంలో పవన్ అనే అగ్ని తుఫాన్ వచ్చేస్తోంది అంటూ అభిమానులు అసెంబుల్ కావాలని ట్వీట్ చేశాడు.

Next Story

Most Viewed