- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును’.. బోల్డ్‌గా ‘అరి ’ట్రైలర్
సాయి కుమార్(Sai Kumar), అనసూయ(Anasuya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అరి’(ari)

దిశ, సినిమా: సాయి కుమార్(Sai Kumar), అనసూయ(Anasuya) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘అరి’(ari). ‘మై నేమ్ ఈజ్ నోబడి’ ట్యాగ్‌లైన్‌తో రాబోతుంది. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను శ్రీనివాస్ రామిరెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మించారు. ఇందులో శుభలేఖ సుధాకర్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, సురభి ప్రభావతి, వినోద్ వర్మ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ మనిషిలోని ఎమోషన్స్‌ను అందరికీ కళ్లకు కట్టినట్లు చూపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ‘అరి’ అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ క్రమంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇక ఇందులో కామం అనే పదంతోనే అన్ని డైలాగ్స్ ఉంటాయి. ముందుగా శ్రీకృష్ణుడి జీవితంలో జరిగింది చెప్తుండగా.. ఓ మహిళ లైబ్రరీకి వెళ్లి కోరిక ఏదైనా తీరుస్తారా? అని ఓ వ్యక్తిని అడుగుతూ కనిపిస్తుంది. ఈ సినిమా మొత్తం బోల్డ్ డైలాగ్స్ ఉండగా.. లైబ్రరీలోనే షూట్ చేసినట్లు కనిపిస్తోంది. ఇక చివరగా.. ‘‘ఇక్కడ అందరి కోరికలు తీర్చబడును’’ అనే క్యాప్షన్ జత చేసి ఆసక్తిని పెంచారు.






