- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమలో పడేందుకు సిద్ధమా.. ‘శశివదనే’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన కోమలి ప్రసాద్
టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్(komali Prasad), రక్షిత్ అట్లూరి(Rakshit Atluri) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘శశివదనే’.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కోమలి ప్రసాద్(komali Prasad), రక్షిత్ అట్లూరి(Rakshit Atluri) కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ చిత్రం ‘శశివదనే’. ఈ సినిమా సాయి మోహన్ ఉబ్బన(Sai Mohan Ubhana) దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అందమైన ప్రేమకథతో రాబోతున్న ఈ చిత్రాన్ని svs సినిమాస్, AGఫిల్మ్స్ బ్యానర్స్‌పై అహితేజ నిర్మిస్తున్నారు. ఈ మూవీ గత ఏడాది విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. అక్టోబర్ 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, కోమలి ప్రసాద్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ‘శశివదనే’ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ట్రైలర్ సెప్టెంబర్ 29న ఉదయం 10:10గంటలకు రాబోతున్నట్లు వెల్లడించింది. అలాగే హృదయాలు కలిసే చోట ప్రేమ వికసిస్తుంది.. ‘శశివదనే’తో ప్రేమలో పడేందుకు సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రియులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






