‘చాంపియన్’ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్ధమా.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ టీమ్

by Mallepaka Hamsa |

స్టార్ కిడ్స్ ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ ఫేమ్‌ను పెంచుకుంటున్నారు.

‘చాంపియన్’ ప్రపంచంలోకి ప్రవేశించేందుకు సిద్ధమా.. బిగ్ అప్డేట్ ఇచ్చిన మూవీ  టీమ్
X

దిశ, సినిమా: స్టార్ కిడ్స్ ఎంతో మంది సినీ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతూ ఫేమ్‌ను పెంచుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సినీ పరిశ్రమలోకి వచ్చి ఊహించని రేంజ్‌కి ఎదిగారు. ఇక టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ (Roshan)కూడా ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు, ఆ తర్వాత ‘పెళ్లిసందడి’ చిత్రంతో హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు ‘చాంపియన్’ (Champion)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రదీప్ అద్వైత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. ఫస్ట్ లుక్ ,గ్లింప్స్ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఈ నేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ‘చాంపియన్’ అప్డేట్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ మూవీ టీజర్‌‌ను నవంబర్ 1న ఉదయం 11:17 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అయితే ఈ టీజర్‌ను ‘బాహుబలి: ది ఎపిక్’ థియేటర్స్‌లో జత చేయనున్నట్లు ప్రకటించి.. సినీ ప్రియులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలిపారు. ‘చాంపియన్’ ప్రపంచంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ పెట్టారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వారంతా ఖుషీ అవుతున్నారు. కాగా, ‘చాంపియన్’ సినిమాలో రోషన్ సరసన కోలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్(Anaswara Rajan) రొమాన్స్ చేయనుంది. ఈ మూవీని స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాల మధ్య సంక్రాంతి కానుకగా.. డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

link

Next Story