Renu Desai: బూతులు తిట్టడానికి ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా, ఉగ్రవాదులా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

మీ దృష్టిలో ఆర్టిస్టులు అంటే నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన మాటలతో దూషించడానికి వారు చేసిన తప్పేంటి?

Renu Desai: బూతులు తిట్టడానికి ఆర్టిస్టులు ఏమైనా నేరస్తులా, ఉగ్రవాదులా.. రేణు దేశాయ్ సెన్సేషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. గత కొంతకాలంగా తన వ్యక్తిగత జీవితంపై అసభ్యకరంగా కామెంట్లు చేస్తున్న నెటిజన్ల తీరుపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేవలం మాటలతో సరిపెట్టకుండా, హద్దులు దాటి ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈనేపథ్యంలో.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ, అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో నెటిజన్లకు ఘాటుగా వివరించారు."మీ దృష్టిలో ఆర్టిస్టులు అంటే నేరస్తులా లేక ఉగ్రవాదులా? అంత దారుణమైన మాటలతో దూషించడానికి వారు చేసిన తప్పేంటి?" అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఒక సెలబ్రిటీ చేసే పని లేదా వారు చెప్పే అభిప్రాయం మీకు నచ్చకపోతే, సింపుల్‌గా వారిని అన్‌ఫాలో చేసి మీ పని మీరు చూసుకోవాలి తప్ప.. ఇలా నీచమైన పదజాలంతో దాడి చేయడం ఏమాత్రం సంస్కారం కాదని హితవు పలికారు.

చాలామంది తమకు నచ్చని విషయంపై బూతులు తిట్టడాన్ని భావ ప్రకటన స్వేచ్ఛ అని పొరబడుతున్నారని, కానీ అది కేవలం వేధింపు మాత్రమేనని రేణు దేశాయ్ స్పష్టం చేశారు. "మీకు నచ్చని అభిప్రాయం ఎవరైనా చెబితే, వెంటనే వారిని వ్యక్తిగతంగా దూషించడం సరికాదు. ప్రతి మనిషికి సమాజంలో గౌరవంగా బతికే హక్కు ఉంది. ఆ హక్కును కాలరాయకండి" అని ఆమె హెచ్చరించారు. తమ కష్టార్జితంతో గౌరవంగా బతికే కళాకారులను టార్గెట్ చేయడం మానుకోవాలని, లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె పరోక్షంగా సూచించారు. ఇప్పటికే తనను దూషించిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్న రేణు దేశాయ్, ఈ వీడియో ద్వారా నెటిజన్లలో మార్పు రావాలని కోరుకున్నారు. సోషల్ మీడియాలో హుందాగా ప్రవర్తించడం నేర్చుకోవాలని, అనవసరపు విమర్శలతో ఇతరుల మనోభావాలను దెబ్బతీయవద్దని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story