- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Custody: జైలులో సంకెళ్లతో సీనియర్ నటుడు
అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’

దిశ, సినిమా : అక్కినేని నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సినిమా.. మే 12న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ యూనిట్.. మూవీ గ్లింప్స్, కృతి శెట్టి పాత్రను ఇంట్రడ్యూజ్ చేయగా తాజాగా అరవింద్ స్వామి క్యారెక్టర్ రివీల్ చేశారు. రాజు అలియాస్ రాజు (Raju aka Raazu) పాత్రలో కనిపించనున్న ఆయన.. చేతికి సంకెళ్లతో సిగరెట్ ముట్టిస్తూ జైలు ఊచల వెనుక నిల్చున్న ఫెరోషియస్ లుక్ మూవీపై అంచనాలను పెంచింది. ఇక ప్రియమణి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమీ విశ్వనాథ్ కీలకపాత్రల్లో కనిపించనున్న సినిమాను.. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Sudheer Babu:మస్త్ షేడ్స్ ఉన్నాయిగా.. సుధీర్ బాబు గ్యాంగ్‌స్టర్ లుక్ వైరల్






