‘అరంగేట్రం’ ఆడియన్స్‌కు మంచి అనుభూతినిస్తుంది: శ్రీనివాస్ ప్రభ‌న్‌

by Harish |   (  Updated:2023-04-26 14:57:43  IST  )

రోష‌న్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభ‌న్‌, అనిరుద్, పూజ, ల‌య‌, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ త‌దిత‌రులు న‌టీన‌టులుగా రూపొందిన సినిమా ‘అరంగేట్రం’.

‘అరంగేట్రం’ ఆడియన్స్‌కు మంచి అనుభూతినిస్తుంది: శ్రీనివాస్ ప్రభ‌న్‌
X

దిశ, సినిమా: రోష‌న్, ముస్తఫా అస్కరి, శ్రీనివాస్ ప్రభ‌న్‌, అనిరుద్, పూజ, ల‌య‌, ఇందు, సాయి శ్రీ, శ్రీవల్లి, కీర్తన, సత్తిపండు, కోటేష్ మానవ త‌దిత‌రులు న‌టీన‌టులుగా రూపొందిన సినిమా ‘అరంగేట్రం’. మ‌హి మీడియా వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ ప్రభ‌న్ ద‌ర్శక‌త్వంలో కె. మ‌హేశ్వరి నిర్మించిన ఈ మూవీ మే 5న రిలీజ్ కాబోతుండగా.. ప్రీరిలీజ్ ఈవెంట్ ప్రసాద్ లాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు మేకర్స్.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు శ్రీనివాస్ ప్రభన్.. ‘ఇది ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీ. సైకో బేస్డ్ కాన్సెప్ట్‌తో సాగుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్. గొప్ప ల‌వ్ స్టోరీ ఉంటుంది. పాట‌లు, ఫైట్స్‌, కామెడీ అన్నీ అలరిస్తాయి’ అని తెలిపాడు. అలాగే ఆరుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిల మ‌ధ్య నాట్య ప్రధానంగా సాగే ఈ సినిమాను చూసిన ఆడియన్స్ థియేటర్ నుంచి మంచి ఫీల్‌తో బ‌య‌ట‌కు వ‌స్తార‌న్న నిర్మాత.. మూవీని ఆదరించి బిగ్ హిట్ చేయాలని నటీనటులు ప్రేక్షకులను కోరారు.

Also Read:

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. తారక్‌తో సినిమాకు హాలీవుడ్ డైరెక్టర్ రెడీ

Next Story