ఇలాంటి క్యారెక్టర్‌ దక్కడం నా అదృష్టమే.. అప్సరా రాణి

by Disha Web Desk 10 |
ఇలాంటి క్యారెక్టర్‌ దక్కడం నా అదృష్టమే.. అప్సరా రాణి
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ అప్సరారాణి తను ప్రధాన పాత్రలో నటించిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘తలకోన’ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. నగేశ్‌ నారదాసి దర్శకత్వంలో దేవర శ్రీధర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ రెండో వారంలో విడుదలకానుండగా రీసెంట్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా అప్సర మాట్లాడుతూ.. ‘యాక్షన్‌, అడ్వెంచర్‌ అంశాలున్న చిత్రం అందరికీ నచ్చుతుంది. షూటింగ్ కోసం అడవిలో చాలా ఇబ్బందులు పడ్డాము. దాదాపు సినిమా షూటింగ్ మొత్తం అడవిలోనే జరిగింది. కెరీర్‌ ప్రారంభంలోనే ఇలాంటి యాక్షన్‌, అడ్వెంచర్‌, నటనకు స్కోప్‌ ఉన్న క్యారెక్టర్‌ నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఎంతో కష్టపడి, ఇష్టపడి చేసిన చిత్రం భారీ విజయంతో పాటు మంచి పేరును తీసుకొస్తుందని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story