ఆ తెలుగు హీరో కోరిక తీర్చమన్నాడు.. ఆర్జీవి బ్యూటీ Apsara Rani కామెంట్స్ వైరల్

by Hamsa |
ఆ తెలుగు హీరో కోరిక తీర్చమన్నాడు.. ఆర్జీవి బ్యూటీ Apsara Rani కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆర్జీవి బ్యూటీ అప్సర రాణికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆమె ‘డేంజరస్’ సినిమాతో ఓ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమాలో నైనా గంగూలీతో చేసిన రొమాన్స్ అంతా ఇంతా కాదు. అందులో లెస్బియన్ పాత్రలో హీటెక్కించేసింది. దీనిని వివాదాస్పద డైరెక్టర్ ఆర్జీవి తెరకెక్కించారు.

తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్సర కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘‘నేను ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో చాలా మంది కమిట్ మెంట్ అడిగారు. కానీ, నేను ఒప్పుకోలేదు. లేదంటే నేను కూడా మంచి పొజీషన్‌లోనే ఉండేదాన్ని.. రీసెంట్‌గా ఓ తెలుగు హీరో సినిమాల్లో ఛాన్స్ ఇస్తానన్నాడు. కానీ, తన కోరిక తీర్చాలని మేనేజర్‌తో అడిగించాడు. అది నాకు నచ్చలేదు. అందుకే ఆ సినిమాను రిజెక్ట్ చేశాను. త్వరలోనే మంచి ఛాన్సులు వస్తాయనే నమ్మకం మాత్రం నాకు ఉంది’’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story