కళ్యాణ్ కొనిచ్చిన చీరను మంటల్లో వేసిన అప్పూ..?

by Disha Web Desk 10 |
కళ్యాణ్ కొనిచ్చిన చీరను మంటల్లో వేసిన అప్పూ..?
X

దిశ,సినిమా: బ్రహ్మ ముడి ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇంటి వాకిట్లో మంచిగా చలి మంటలు వేసి.. ఇంటి ముందు ఏదో కోల్పోయినట్లు అందరూ కూర్చుంటారు. ‘ఆర్డర్ తీసుకుని మాటలు పడాల్సి వచ్చింది. ఎలాగైనా అది పూర్తి చేసి ఉంటే.. ఓ పని అయిపోతుందని కృష్ణమూర్తి' అంటాడు. ‘కావ్య ఉన్నప్పుడు.. రాత్రి పగలు పని చేసి మరీ.. ఒప్పుకున్నా పనులను పూర్తి చేసేది. ఇప్పుడు అన్నీ నువ్వు ఒక్కడివే చేసుకోవాల్సి వస్తోందని ' అంటుంది అన్నపూర్ణ. ‘కావ్య ఉంటే పెద్ద అండగా ఉండేది. కానీ ఇప్పుడు వీళ్లు ఇచ్చిన పనిని పూర్తి చేస్తారా అని భయపడుతున్నారు..’ అంటుంది కనకం

ఇంతలో అప్పూ.. కళ్యాణ్ కొనిచ్చిన చీరను.. మంటల్లోకి వేసేస్తుంది. అది చూసిన ముగ్గురూ షాక్ అయ్యి పైకి లేస్తారు. ‘అప్పూ’ నువ్వు ఏమి చేస్తున్నావ్ అని కృష్ణమూర్తి అంటాడు. ‘ఏంటే మంచి చీరను మంటల్లో వేశావ్.. ఏమైందే పిచ్చి పట్టిందా నీకు ’ అంటుంది కనకం కోపంగా. ‘ఆ ఫొటోలన్నీ ఎవరివీ అప్పూ?’ అని అన్నపూర్ణ అంటుంది. ఇంకెవరివి ఉంటాయి నా దగ్గర ‘హా.. ఆ కవిగాడివి..’ అని అంటుంది అప్పూ. ‘అది వాడు కొనిచ్చిన చీరే.. వాడికి సంబంధించిన ఏది నా దగ్గర ఉండటానికి వీల్లేదని అంటుంది.



Next Story

Most Viewed