సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్న అనుష్క శర్మ!

by Disha Web Desk 6 |
సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పబోతున్న అనుష్క శర్మ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్నప్పుడే విరాట్ కోహ్లీతో ప్రేమలో పడింది. తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరు ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి ఇప్పుడు ఒక పాప. ప్రస్తుతం ఈ దంపతులు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే అనుష్క కూతురి బాధ్యతలు చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇటీవల రెండు సినిమాలు, వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అనుష్క సినిమాలకు పూర్తిగా దూరం కాబోతుందటూ ఒక వీడియో వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోలో అనుష్క మాట్లాడుతూ ‘నా జీవితంలో నాకు పెళ్లి అనేది చాలా ముఖ్యం. పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత బహుశా సినిమాల్లో నటించడం నాకు ఇష్టం ఉండకపోవచ్చు’ అంటూ చెప్పింది. దీంతో అనుష్క రెండోసారి తల్లి కాబోతుందని, ఇక సినిమాల్లో కనిపించదని ప్రచారం చేస్తున్నారు నెటిజన్లు.



Next Story