ప్రభాస్‌తో మరో సినిమా చేయడంపై స్పందించిన అనుష్క!

by Disha Web Desk 10 |
ప్రభాస్‌తో మరో సినిమా చేయడంపై స్పందించిన అనుష్క!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి మహేష్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క ఈ సినిమా ముచ్చట్లతోపాటు ప్రభాస్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది. ‘‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ కథ వినగానే నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది’ అని చెప్పింది. ఈ క్రమంలోనే ‘మీరు ప్రభాస్‌తో మళ్లీ ఎప్పుడు నటిస్తారు? అనే ఓ అభిమాని ప్రశ్నకు ‘నిజం చెప్పాలంటే మంచి కథ దొరికితే ఎప్పుడైనా ఆయనతో చేయడానికి రెడీ. మేము ఇద్దరం మంచి ఫ్రెండ్స్’ అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి: ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

Next Story

Most Viewed