Nagarjuna 100 Movie: నాగ‌ర్జున సినిమాలో మ‌రో హీరోయిన్‌..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే?

by velandi.Saikiran |

నాగార్జున సినిమాలో ట‌బుతో పాటు అనుష్క శ‌ర్మ కూడా ఫైన‌ల్ అయిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

Nagarjuna 100 Movie: నాగ‌ర్జున సినిమాలో మ‌రో హీరోయిన్‌..ఇక ఫ్యాన్స్ కు పండ‌గే?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున త్వరలోనే తన 100వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు ఆర్ కార్తీక్ చాలా గ్రాండ్ గా తెరకెక్కించనున్నాడు. ఈ సినిమా పొలిటికల్ డ్రామాలో వస్తున్నట్లు నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం పదవి చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ప్రత్యేక పాత్రలో మెరువనున్నారని టాక్ న‌డుస్తోంది.

అటు ఈ సినిమాలో టబు హీరోయిన్ గా నటిస్తున్నట్లు మొదటి నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే, టబు కంటే ముందు నయనతారను సంప్రదించారట. కానీ టబు ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఆమెతో పాటు మరో హీరోయిన్ కూడా ఇందులో నటించబోతున్నట్లు సమాచారం అందుతోంది. అనుష్క ను ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రంగంలోకి దించబోతున్నారట. ఈ మేరకు ఆమెతో చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story