- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Anurita Jha: ఆ ప్రాజెక్ట్ నా జీవితాన్ని నాశనం చేసింది.. చాలా నష్టపోయా
గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ తర్వాత తన జీవితంలో చెత్త దశను ఎదుర్కొన్నానంటోంది యంగ్ బ్యూటీ అనురితా ఝా. 2012 అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ సెకండ్ పార్ట్‌లో షామా పర్వీన్ పాత్రను పోషించిన నటి

దిశ, సినిమా: ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ తర్వాత తన జీవితంలో చెత్త దశను ఎదుర్కొన్నానంటోంది యంగ్ బ్యూటీ అనురితా ఝా. 2012 అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ సెకండ్ పార్ట్‌లో షామా పర్వీన్ పాత్రను పోషించిన నటి.. ఈ క్యారెక్టర్‌కు మంచి మార్కులు పడటంతో మొదటిసారి విజయం రుచి చూసినట్లు అనిపించిందని చెప్పింది. అలాగే ప్రజలు తనును మెచ్చుకోవడంతో తన కెరీర్ మలుపు తిరిగినట్లే భావించానని తెలిపిన బ్యూటీ.. ‘ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల 2013-16 మధ్య కాలంలో ఆర్థికంగా చాలా నష్టపోయాను. ఎందుకంటే ఆ పాత్రనుంచి బయటపడటానికి చాలా టైమ్ పట్టింది. అదే మూడ్‌లో చాలా అవకాశాలు రిజెక్ట్ చేశా. ఒకరకంగా చెప్పాలంటే ఆ సినిమా వల్ల మానసికంగా దెబ్బతిన్నాను. అనేక అనారోగ్య సమస్యలతో సతమతమయ్యాను. చివరగా నేనే స్వయంగా కథలను డీల్ చేయడం మొదలుపెట్టాను’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది.
Also Read: Shilpa Shetty : బికినీలో సూపర్ సెక్సీగా కనిపించిన శిల్పాశెట్టి






