- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, సినిమా: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ‘ది కేరళ స్టోరీ-2’ (The Kerala Story-2)గురించే చర్చ. సెన్సేషనల్ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజైన క్షణం నుంచే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఫిబ్రవరి 27న సినిమా థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్న వేళ, బాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ అనురాగ్ కశ్యప్ వేసిన బాంబు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఫిల్మ్‌ఫేర్ వేడుకలో అనురాగ్(Anurag Kashyap) చేసిన వ్యాఖ్యలు మంటలు పుట్టిస్తున్నాయి. ‘‘ఇది సినిమా కాదు.. కేవలం డబ్బులు పొందడానికే చేస్తున్న ప్రయోగం" అంటూ ఆయన విరుచుకుపడ్డారు. ట్రైలర్‌లో ఒక వర్గానికి బలవంతంగా బీఫ్ తినిపించే సీన్‌పై స్పందిస్తూ.. ‘‘ఎవరైనా బీఫ్ తినిపిస్తారా? కనీసం కిచిడీని కూడా అలా తినిపించరు’’ అంటూ మండిపడ్డారు. సున్నితమైన అంశాలను వక్రీకరించి లాభపడాలని చూస్తున్నారంటూ ఆయన చేసిన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.
ఈక్రమంలో.. తాజాగా, ‘కేరళ స్టోరీ-2’ దర్శకుడు కామాఖ్య నారాయణ్ ఏమాత్రం తగ్గకుండా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఒక వీడియో రిలీజ్ చేస్తూ అనురాగ్ కశ్యప్ పరువు తీసేలా మాట్లాడారు. ‘‘బహుశా ఆయన మానసిక స్థితి సరిగా లేనట్లుంది. ఆయనకు లోకంలో అన్నిటితోనూ సమస్యే. ఇండస్ట్రీతో గొడవ, నెట్‌ఫ్లిక్స్‌తో గొడవ, సమాజంతో గొడవ.. ఇలా ప్రతిదాన్నీ సమస్యగానే చూస్తారు’’ అని మండిపడ్డారు. గతంలో అనురాగ్ తీసిన సినిమాల్లో ఇంతకు మించిన సీన్లు ఉన్నాయని, నాగరికత లేని ఆ సినిమాలను చూసిన జనం ఆయన మాటలను ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని కామాఖ్య అన్నారు. ఒకవైపు వాస్తవ సంఘటనల ఆధారంగా తీశామని మేకర్స్ చెబుతుంటే.. మరోవైపు ఇది కేవలం సమాజాన్ని విడదీయడానికే అని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ మాటల యుద్ధం సినిమాకు కావాల్సినంత ఫ్రీ పబ్లిసిటీని తెచ్చిపెడుతోంది. కానీ అంతే రేంజ్‌లో నెగెటివిటీ కూడా వస్తుంది. వివాదాల్లో చిక్కుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కావడం కష్టమే అనిపిస్తోంది.






