- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నన్ను టార్గెట్ చేసి పరువు తీస్తున్నారు.. నిందితులు ఎవరో తెలిసి షాక్ అయ్యానంటూ అనుపమ సంచలన పోస్ట్
కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలతు టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

దిశ, సినిమా: కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలతు టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. స్టార్ హీరోల కానుంచి హీరోయిన్ల వరకు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇటీవల చిరంజీవి కూడా మార్ఫింగ్ ఫొటోలతో ఇబ్బంది పడ్డారు. తాజాగా, ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)కు సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇందులో షాకింగ్ ట్విస్ట్ ఒకటి ఉంది. ఇన్నాళ్లు ఇలా చేస్తుంది.. అబ్బాయిలే అని అంతా అనుకున్నారు. కానీ అనుపమ ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేసింది మాత్రం ఓ 20 ఏళ్ల అమ్మాయి అని తెలిసి అంతా భయపడిపోతున్నారు.
ఈ విషయాన్ని తెలియజేస్తూ అనుపమ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ నోట్ షేర్ చేసింది. ‘‘కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో నా పోస్టులు పెడుతున్నారు. ముందు పట్టించుకోలేదు. అయితే నా ఫొటోలను మార్ఫింగ్ చేసి ఏకంగా నా కుటుంబ సభ్యులతో నా స్నేహితులకు, సెలబ్రిటీలకు కూడా షేర్ చేశారని తెలుసుకుని చాలా బాధపడ్డాను. ఆపై ఎలాంటి ఆధారాలు లేకుండానే నా గురించి తప్పుడు సమాచారం వైరల్ చేస్తున్నారు. వాటిని చూసి ఎవరో కావాలనే టార్గెట్ చేసి చేస్తున్నారని తెలుసుకున్నాను. ఒకే వ్యక్తి చాలా అకౌంట్లతో ఈ సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు తెలిసింది. నేను ఏదైనా పోస్ట్ పెట్టినా తప్పుడు కామెంట్లు చేస్తున్నారు. అందుకే నేను కేరళ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.
వాళ్ళు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చెపట్టారు. అందులో నిజాలు బయటకు వచ్చాయి. ఇదంతా చేసింది తమిళనాడులో ఓ 20 ఏళ్ల యువతి అని తెలిసి షాక్ అయ్యాను. తన భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె వివరాలను ప్రపంచానికి చెప్పదలుచుకోలేదు. చట్టం తన పని తాను చూసుకుంటుందని వదిలేస్తున్నాను. యువత మేలుకోవాలనే ఈ విషయాన్ని చెబుతున్నా. చేతిలో ఫోన్, ఉందని సోషల్ మీడియా అకౌంట్ ఉందని ఒకరి పరువు తీసే హక్కు మీకు లేదు. ప్రజలు బాధ్యతాయుతంగా ఉండాలి. చట్టం అందరికీ సమానమే’’అని రాసుకొచ్చింది. దీంతో ఈ విషయం తెలిసి యువతులు భయపడిపోతున్నారు.






