- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంలో అనుపమ మూవీ.. హిందువుల మనోభావాలు దెబ్బతీయోదంటూ హెచ్చరిక!
మలయాళ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్, కార్తికేయ, ఉన్నది ఒకటే జీవితం, శతమానం భవతి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.

దిశ, సినిమా: మలయాళ యంగ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్, కార్తికేయ, ఉన్నది ఒకటే జీవితం, శతమానం భవతి వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇటీవల అనుపమ పరమేశ్వరన్ ‘డ్రాగన్’(Dragon) సినిమాతో ఘన విజయం సాధించింది. ప్రస్తుతం మలయాళంలో కోర్ట్ రూమ్ థ్రిల్లర్ ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’(Janaki vs. State of Kerala) మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రవీణ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సురేష్ గోపీ, దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్(Shruti Ramachandran), బైజు సంతోష్, ఆస్కార్ అలీ వంటి వారు కీలక పాత్రలో కనిపించిబోతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది.
ఈనేపథ్యంలో.. తాజాగా, ‘జానకి వర్సెస్ స్టేట్ కేరళ’ సినిమా వివాదంలో చిక్కుకుంది. అనుపమ పరమేశ్వరన పోషిస్తున్న బాధితురాలి పాత్రకు ‘జానకి’ అనే పేరు పెట్టడం సెన్సార్ బోర్డ్ ఇష్టపడలేదు. దీంతో టైటిల్‌లోని ఆ పేరు మార్చడంతో పాటు ఆ పాత్రకు కూడా మార్చకపోతే సర్టిఫికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. జానకి పేరును సీతాదేవికి మరో రూపంగా పరిగణించబడుతోంది. సీతాదేవితో సమానమైన పేరును అత్యాచార బాధితురాలికి పెట్టడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసింది.
హిందూ దేవత పేరు కాబట్టి మతపరమైన భావాలను దెబ్బతీస్తుందని వారు భావించారు. ఇక ఈ వివాదాన్ని మలయాళ ఫిలిం ఎంప్లాయీస్ ఫేడరేషన్ కూడా ధృవీకరించింది. మార్పులు చేస్తేనే విడుదల అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇక దీనిపై నిర్మాత.. జానవి అనేది పాత్ర పేరు మాత్రమేనని ఎవరినీ కించపరచాలని ఆ పేరును ఉపయోగించలేదని అన్నారు. పేరు మార్చడం కుదరని మళ్లీ సెన్సార్ బోర్డులు అప్పిల్ చేసినట్లు సమాచారం.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. link






