ఏకంగా ఆ స్టార్ కిడ్‌తో రొమాన్స్‌కి సిద్దం అయిన అనుపమ.. ఇన్ స్టా పోస్ట్ వైరల్

by Dishafeatures1 |
ఏకంగా ఆ స్టార్ కిడ్‌తో రొమాన్స్‌కి సిద్దం అయిన అనుపమ.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: ‘ప్రేమమ్’ సినిమాతో పరిచయం అయిన మలయాళం నటి అనుపమ పరమేశ్వరన్. తెలుగులో ‘అ. ఆ..’ మూవీ ద్వారా పరిచయమై ఇక్కడే ఎక్కువ చిత్రాలు తీసి తనకంటూ గుర్తింపు సంపాదించుకుంది. తర్వాత అటు తమిళం, మలయాళం లో కూడా సినిమాలు చేస్తూ, దక్షిణాదిలో బిజీ గా ఉంటూ వస్తోంది. కానీ విజయవంతమైన సినిమాలో నటించినప్పటికి అనుపమకి కేరీర్‌కి మాత్రం పెద్దగా ఏ బ్రేక్ ఇవ్వలేదనే చెప్పాలి. ఈ మధ్యనే విడుదలైన ‘ఈగల్’ సినిమాలో కూడా అనుపమ ఒక ముఖ్య పాత్ర చేసినా, ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు. దీంతో ప్రస్తుతం ఈ అమ్మడు తన ఆశలని ‘టిల్లు స్క్వేర్’ సినిమాపైనే వున్నాయి. సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న ఈ మూవీలో అనుపమ ఊహించని రీతిలో గ్లామర్ పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ప్రచార వీడియోలు, పాటల వీడియోలు చూస్తుంటే అర్ధం అవుతుంది.

ఇదిలా ఉంటే తాజాగా అనుపమ ఒక తమిళ సినిమా ఒప్పుకుంది. ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ కథానాయకుడిగా, మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీలో ధృవ్ పక్కన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా చేస్తుంది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చెప్పింది.

Next Story