Anupama Parameswaran: అనుపమకు చేదు అనుభవం.. వాళ్ల వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నానంటూ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే ఫుల్ ఫేమ్ దక్కించుకుంది.

Anupama Parameswaran: అనుపమకు చేదు అనుభవం.. వాళ్ల వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నానంటూ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ‘ప్రేమమ్’ చిత్రంతో మలయాళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తెలుగులోనే ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఎన్నో హిట్స్ చిత్రాల్లో నటించిన ఈ భామ రింగుల జుట్టుతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఇక ఇటీవల ‘డ్రాగన్’ (Dragon)సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె ఘన విజయం సాధించింది. అదే ఫామ్‌తో తెలుగు, తమిళ, మలయాళ అని భాషతో సంబంధం లేకుండా వరుస అవకాశాలు అందుకుంటోంది. త్వరలోనే అనుపమ ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’(Janaki vs State of Kerala) చిత్రంతో రాబోతుంది. ప్రవీణ్ నారాయణ్ (Praveen Narayan)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో దివ్య పిళ్లై, శృతి రామచంద్రన్, సురేష్ గోపి(Suresh Gopi) వంటి వారు కీలక పాత్రలో కనిపించనున్నారు.

తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఆడియో లాంచ్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న అనుపమ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు నటన రాదని ఎంతో మంది నన్ను ట్రోల్ చేశారు. అలాంటివి ఎన్ని ఉన్నా కూడా ఈ సినిమా ప్రవీణ్ నారాయణన్ నాకు లీడ్ రోల్ ఇచ్చారు. ఈ సినిమాకు ఓ హృదయం ఉంది. అదే జానకి పాత్ర. అలాంటి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విమర్శలు నాలో ఆలోచనను పెంచాయి. ప్రేక్షకులకు నచ్చే సినిమాలు మాత్రమే అంగీకరించాలని నిర్ణయించుకున్నాను. అయితే కొవిడ్ సమయంలో నా సినీ కెరీర్‌లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను.

అయినప్పటికీ ‘జానకి vs స్టేట్ ఆఫ్ కేరళ’ లో పాత్ర ఇవ్వడమే నాకు దక్కిన విజయం అనుకుంటున్నారు. నాకు మద్దతు ఇచ్చిన వారికి, ద్వేషించిన వారికి థాంక్స్. వాళ్ల వల్లే నేను ఈరోజు ఇలా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఇదే వేడుకలో పాల్గొన్న నటుడు సురేష్ ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఇలాంటి అనుభవాలే సిమ్రన్, నయనతార, అసిన్‌లు కూడా జరగడంతో ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఆ తర్వాత స్టార్లు అయ్యారు. అలాగే అనుపమ కూడా ఒక స్టార్ అవుతుందని చెప్పారు. మరీ ముఖ్యంగా ఆమె డేట్ల కోసం డైరెక్టర్లు ఎదురుచూసే పరిస్థితి వస్తుందని అనడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

Next Story