ప్లీజ్ నన్ను ఆ పేర్లతో పిలవొద్దు.. ఇంకా నా పని అయిపోలేదు: Anupam Kher

by Dishanational2 |
ప్లీజ్ నన్ను ఆ పేర్లతో పిలవొద్దు.. ఇంకా నా పని అయిపోలేదు: Anupam Kher
X

దిశ, సినిమా : వెటరన్ లేదా లెజెండ్ అని పిలిపించుకోవడం తనకు అసలే ఇష్టం లేదంటున్నాడు సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్. అంతేకాదు తాను తన సమకాలీనులతో పోటీ పడటం లేదని, ప్రపంచంలోనే చెప్పుకోదగిన ఫిట్‌నెస్ ఫ్రీక్ టైగర్ ష్రాఫ్స్‌కు ధీటుగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపాడు. ‘ప్లీజ్ నన్ను వెటరన్ లేదా లెజెండ్ అని పిలవొద్దు. అలాంటి పొగడ్తలు నాకు ఇష్టం లేదు. నేను నా సమకాలీనులతో పోటీ పడటం లేదు. టైగర్ ష్రాఫ్స్‌తోనే నాకు పోటీ. కాబట్టి నన్ను లెజెండ్ అని పిలవకండి. ఎందుకంటే ఈ ట్యాగ్‌లు తగిలించుకుంటే నేను చాలా పనిచేశానని అర్థం. దయచేసి వీటిని వాపస్ తీసుకోండి. నా పదవీ విరమణకు ఇంకా 30-40 ఏళ్ల సమయం ఉంది. నేను ఇండస్ట్రీలో చేయాల్సింది చాలా ఉంది’ అన్నాడు. చివరగా ఇదంతా కామెడీ కాదని ఎవరు ఏమనుకున్నా తనకంటూ ప్రత్యేక లక్ష్యం, కమిట్‌మెంట్‌ ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Eesha Rebba : వయ్యరాలు ఒలకబోసి. ..హాట్ అందాలు తో పిచ్చెక్కిస్తున్న ఈషా రెబ్బ

Next Story

Most Viewed