Anudeep Kv: జాతిరత్నాలు దర్శకుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?

by Disha Web Desk 10 |
Anudeep Kv: జాతిరత్నాలు దర్శకుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్ : జాతి రత్నాలు సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు పొందిన అనుదీప్ అడ్రెస్ లేకుండా పోయాడు. తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమాతో తర్వాత తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకున్నాడు. కానీ ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత కనిపించకుండా పోయాడు. ఆ మధ్య ఒకకొత్త సినిమా ప్రారంభం కాబోతుందంటూ పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లుగా అనుదీప్ రెండు సినిమాలతోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.తెలిసిన సమాచారం ప్రకారం అనుదీప్ ప్రస్తుతం ఇతర సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా పని చేస్తున్నడట. జాతి రత్నాలు సూపర్ హిట్ మూవీని అందించిన డైరెక్టర్ ఇంత త్వరగా ఫేడ్ ఔట్ అవుతాడని ఎవరు ఊహించలేదు.

Read more:

పవన్ కల్యాణ్‌ను అడ్డంగా బుక్ చేయనున్న రేణు దేశాయ్.. ‘కమింగ్ సూన్’ అంటూ సంచలన వీడియో



Next Story