Allu Arjun :అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. లండన్‌లో మైనపు విగ్రహం

by Disha Web Desk 9 |
Allu Arjun :అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. లండన్‌లో మైనపు విగ్రహం
X

దిశ, సినిమా: మన టాలీవుడ్ హీరోలు లోకల్ టు గ్లోబల్ అంటూ దూసుకుపోతున్నారు. ఇందులో ఇప్పటికే రామ్ చరణ్, ప్రభాస్, తారక్ ఉండగా.. ‘పుష్ప’ మూవీతో అల్లు అర్జున్ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక ఇటీవల నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌కు మరో ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కనుంది. మేడమ్ టుస్సాడ్స్‌లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరనుంది. ఈ ప్రతిష్టాత్మక మ్యూజియంలో చోటు దక్కడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పటి వరకు టాలీవుడ్ నుంచి ప్రభాస్, మహేష్ బాబు మాత్రమే ఈ ఘనత సాధించగా.. ఇప్పుడు అల్లు అర్జున్ చేరిపోయాడు. ఇందుకోసం బన్నీ త్వరలోనే లండన్‌లోని ఈ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : ఆలస్యం చేయకుండా యాక్షన్‌లోకి దిగిపోయిన తారక్.. ‘దేవర’ కోసం తెగ కష్టపడుతున్నాడట!



Next Story

Most Viewed