'హర హర మహాదేవ్'.. తెలుగు పోస్టర్‌ రిలీజ్ చేసిన నాగార్జున

by Disha Web Desk 7 |
హర హర మహాదేవ్.. తెలుగు పోస్టర్‌ రిలీజ్ చేసిన నాగార్జున
X

దిశ, సినిమా : అభిజిత్ దేశ్‌పాండే దర్శకత్వంలో సుబోధ్ భావే, శరద్ కేల్కర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'హర హర మహాదేవ్'. అక్టోబర్ 25న ఐదు భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు పోస్టర్‌ను అక్కినేని నాగార్జున విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'జీ స్టూడియోస్, శ్రీ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నా చిన్నతనం నుంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి, ఆయన పరిపాలన గురించి గొప్పగా విన్నాను.

ఈ కథను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. లక్షా యాభై వేల సైన్యాన్ని కేవలం 300 మంది యోధులతో ఎలా ఎదుర్కొన్నారో ఇందులో చూపించబోతున్నారు. నేను కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. ఐదు భాషల్లో విడుదల అవుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పుడు సినిమాల పరంగా భారతదేశం అంతా ఒక్కటే అయింది. భాషాబేధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు. కంటెంట్ బాగుంటే అన్ని భాషల ప్రేక్షకులు సినిమాలను విజయవంతం చేస్తున్నారు' అని చెప్పారు.

ఇవికూడా చదవండి: 'పుష్ప 2' షూటింగ్‌కు బ్రేక్.. ఆందోళనలో అభిమానులు



Next Story