Venu Swamy తో మరో హీరోయిన్ రహస్య పూజలు..!

by Disha Web Desk 1 |
Venu Swamy తో మరో హీరోయిన్ రహస్య పూజలు..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి పేరు మారుమోగుతోంది. సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది సెలబ్రిటీల జాతకాలను ఎప్పటికప్పుడు బయట పెడుతూ ఆయన ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఇటీవల రాంచరణ్-ఉపాసన దంపతులకు అమ్మాయి పుట్టగా, ఆ పాప పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి జాతకం చెప్పేశాడు. రాంచరణ్ కూతురుది మహర్జాతకమని పేరు ప్రతిష్టల్లో తన తల్లిదండ్రులనే మించిపోతుందని వేణు స్వామి జాతకం చెప్పాడు.

అదేవిధంగా వేణు స్వామితో పూజలు చేయించుకుంటే తమ కెరీర్ సాఫీగా సాగిపోంతుందనే నమ్మకం సెలబ్రిటీల్లో ఏర్పడింది. ఈ క్రమంలోనే హీరోయిన్ రష్మిక మందాన వేణు స్వామితో పూజులు చేయించుకుని తన శిష్యురాలిగా మారిపోయింది. అదేవిధంగా మరో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామిని సంప్రదించి తనకు సంబంధించి కొన్ని పూజలు చేయించుకుంది.

తాజాగా ఈ లిస్ట్ లో డింపుల్ హయాతి కూడా చేరింది. ఈ హైదరాబాద్ బ్యూటీ వేణు స్వామితో రహస్య పూజలు చేయించుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డింపుల్ హయాతి కెరీర్ అంతగా బాగోలేదు. ఆమెకు ఆఫర్స్ వస్తున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు.

రవితేజకు జంటగా ఖిలాడి చిత్రం చేయగా నిరాశపరిచింది. లేటెస్ట్ రిలీజ్ రామబాణం మరో డిజాస్టర్ అయ్యింది. అలాగే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఐపీఎస్ అధికారి రాహుల్ హెగ్డే ఆమె మీద కేసు పెట్టాడు. తన వాహనాన్ని ఆమె కాలితో తన్నినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో డింపుల్ విచారణ ఎదుర్కొంటుంది. ఈ సమస్యల నుండి గట్టెక్కేందుకు డింపుల్ హయాతి వేణు స్వామి సంప్రదించినట్లు తెలుస్తుంది.

Also Read: డ్రగ్స్ కేసు కేపీ చౌదరితో పరిచయంపై.. క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన నటి జ్యోతి..


Next Story

Most Viewed