డ్రగ్స్ కేసు KP Choudary తో పరిచయంపై.. క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన నటి Jyothi

by Disha Web Desk 6 |
డ్రగ్స్ కేసు KP Choudary తో పరిచయంపై.. క్లారిటీ ఇస్తూ వీడియో రిలీజ్ చేసిన నటి Jyothi
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ‘కబాలి’ సినిమా ప్రొడ్యూసర్ కేపీ చౌదరి డ్రగ్స్ కేసు రోజు రోజుకు కీలక మలుపులు తిరుగుతుంది. అతడి దగ్గర డ్రగ్స్ కొన్న వారిలో టాలీవుడ్‌కు చెందిన కొందరు సెలబ్రీటీలు, ప్రముఖ వ్యాపారుల కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. అందులో నటి జ్యోతి, అషురెడ్డి, సురేఖవాణి ఆయనతో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో వారు కూడా ఉన్నారని వార్తలు వచ్చాయి. ఇటీవల అషు స్పందించిన విషయం తెలిసిందే.

తాజాగా, నటి జ్యోతి కేపీ చౌదరికి ఉన్నటువంటి పరిచయం ఏంటో తెలుపుతూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది. ‘‘ నేను ఈ రోజు లైవ్‌కి రావడానికి కారణం ఏంటంటే.. షూట్‌లో ఉంటే నాకు చాలా కాల్స్, మేసేజ్‌లు వస్తున్నాయి. డ్రగ్స్ కేసులో అన్ని టీవీ ఛానల్లో ఫొటోలు వస్తున్నాయని చెబుతున్నారు. కేపీ అనే వ్యక్తి ఏం చెప్పారో కూడా నాకు తెలుసుకోకుండా మీరు ఇలా ఫొటోస్ వేయడం అనేదీ చాలా తప్పు. అది ఎంత బాధపెడుతుందంటే దయచేసి నిజనిజాలు తెలుసుకుని రాయండి. నేను ఒకవేళ తప్పు చేస్తే ఒప్పుకుంటాను. నాకు అతనికి జస్ట్ ఫ్రెండ్‌షిప్ మాత్రమే ఉంది. అది కూడా వాళ్ల అబ్బాయి హైదరాబాద్‌కు వచ్చినా అతను వచ్చినా వాళ్ల అబ్బాయిని మా ఇంట్లో డ్రాప్ చేస్తారు. నేను వాళ్ళ అబ్బాయిని చూసుకుంటూ ఉంటాను. మా అబ్బాయితో ఇంట్లో వీడియో గేమ్స్ ఆడుతుంటాడు. ఈ రకంగా ఆయనకు నాకు ఓ ఫ్యామిలీ బాండింగ్ తప్ప ఎలాంటి కలెక్షన్స్ లేవు.

6 నెలల నుంచి ఫోన్ కాల్స్ ఉన్నాయని అంటున్నారు. అవి నాకు చూపించండి. నేను అతనితో మాట్లాడింది అమ్మ ఎలా ఉంది తిన్నావా, లేదా ఇలాంటివి మాత్రమే మాట్లాడుతాను. నేను ఏ కాల్ లిస్ట్ డిలీట్ చేయలేదు. నన్ను పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసినా కూడా నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను. అమ్మాయిల మీద తప్పుడు ప్రచారాలు చేయకండి. నాకు దాంతో నాకు సంబంధం లేదు. నా ఫొటోస్ అంత డేర్‌గా వేయడానికి మీకు అంత హక్కు ఎవరు ఇచ్చారు. నాకు ఎటువంటి భయం లేదు. తప్పు చేస్తే భయపడాలి. నేను తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అవసరమైతే నార్కోటిక్ టెస్ట్‌కి కూడా రెడీగా ఉన్నాను. పార్టీలకు వెళ్లే అలవాటు నాకు లేదు. దయచేసి నిజనిజాలు తెలుసుకున్నాక వేయండి నేను ఒప్పుకుంటాను. కేపీ చౌదరికి నాకు ఎలాంటి డ్రగ్స్ డీలింగ్స్ లేవు. ’’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: వేణు స్వామితో మరో హీరోయిన్ రహస్య పూజలు..!

Next Story

Most Viewed