బాలయ్య-క్రిష్ కాంబోలో మరో సినిమా?

by velandi.Saikiran |

దర్శకుడు క్రిష్ తో మరో సినిమా చేసేందుకు బాలయ్య డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది.

బాలయ్య-క్రిష్ కాంబోలో మరో సినిమా?
X

దిశ‌, వెబ్ డెస్క్: నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా కొనసాగుతున్న బాలయ్య, సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా దూసుకు వెళ్తున్నారు. అదే సమయంలో ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మంచి ట్రీట్ అందిస్తున్నారు బాలయ్య. ఇక ఇటీవల హిందూ ధర్మం ఒట్టి పడేలా అఖండ 2 సినిమా చేసిన నందమూరి బాలయ్య, మంచి సక్సెస్ అందుకున్నాడు.

క్రిష్ తో మరో సినిమా చేసేందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్

వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న బాలయ్య, మరో సినిమాకు సంతకం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దర్శకుడు క్రిష్ తో మరో సినిమా చేసేందుకు బాలయ్య డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే క్రిష్ వినిపించిన కథకు బాలయ్య కూడా ఓకే చెప్పారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా రాబోతున్నట్లు టాక్. జూన్ 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు ఉంది. ఈ సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. కాగా ఇప్పటికే బాలయ్య, క్రిష్ కాంబినేషన్ లో గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story