- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో బంపరాఫర్ కొట్టేసిన తేజ సజ్జా సిస్టర్.. ఏకంగా ఆ స్టార్ డైరెక్టర్ సినిమాలోనే
స్టార్ హీరో శరత్ కుమార్(Sarathkumar) తనయురాలు వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: స్టార్ హీరో శరత్ కుమార్(Sarathkumar) తనయురాలు వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘పోడా పోడి’(Poda Podi) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే ఈ భామ ‘తెనాలి రామకృష్ణ బి ఏ. బి ఎల్’(Tenali Ramakrishna BA.BL) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఆ తర్వాత క్రాక్(Krack), ‘నాంది’(Nandi), ‘యశోద’(Yashoda), ‘వీర సింహా రెడ్డి’(Veera Simha Reddy), ‘మైఖేల్’(Mikel), ‘ఏజెంట్’(Agent), ‘కోటబొమ్మాళి పీ.ఎస్’, ‘హనుమాన్’(Hanuman), ‘శబరి’(Shabari), ‘మిస్టర్ సెలెబ్రిటీ’(Mr. Celebrety), ‘ఆర్‌టీఐ’(RTI), ‘మ్యాక్స్’(MAX) వంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే రీసెంట్‌గా విశాల్(Vishal) నటించిన ‘మదగజ రాజ’(Madagaja Raja) సినిమాతో మన ముందుకు వచ్చింది. ఇందులో అంజలి(Anjali) కూడా ప్రముఖ పాత్ర పోషించింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే నికోలయ్ సచ్ దేవ్(Nikolay Sachdev)ను ప్రేమించి పెళ్ళి చేసుకుంది. కాగా సచ్‌దేవ్‌కు ఇది రెండో పెళ్ళి అతనికి ఆల్రెడీ టీనేజ్ ఏజ్ ఉన్న అమ్మాయి కూడా ఉంది.
ఇదిలా ఉంటే.. వరలక్ష్మి కేవలం తెలుగు(Telugu), తమిళ(Tamil) సినిమాలు మాత్రమే కాకుండా సౌత్ ఇండియా భాషల్లో నటిస్తూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఈ భామకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ‘ఆదిపర్వం’(adiparvam) ఫేమ్ సంజీవ్ మేగోటి(sanjeev Megoti) డైరెక్షన్‌లో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ మూవీ చేయబోతున్నట్లు సమాచారం. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ సినిమాకి ఈ అందాల ముద్దుగుమ్మ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా ఈ మూవీలో ఈ బ్యూటీదే మెయిన్ లీడ్ పాత్ర కావడం విశేషం. ఇక భారీ బడ్జేట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖులను కూడా తీసుకోబోతున్నరని సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో కోడై కూస్తోంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.






