సర్వం ‘ఇచ్చేసుకుంటాలే’ అంటున్న నుపూర్ సనన్.. ఆ అందాలకు ఫ్యాన్స్ ఫిదా!

by Disha Web Desk 10 |
సర్వం ‘ఇచ్చేసుకుంటాలే’ అంటున్న నుపూర్ సనన్.. ఆ అందాలకు ఫ్యాన్స్ ఫిదా!
X

దిశ, సినిమా: మాస్ హీరో రవితేజ నటించిన మూవీ ‘టైగర్ నాగేశ్వరరావు’ నుంచి మరో బ్యూటిపుల్ సాంగ్ రిలీజైంది. ఇండియ‌న్ రాబిడ్ హుడ్‌గా పిలవ‌బ‌డే గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వరరావు జీవిత క‌థ అధారంగా వంశీ తెరకెక్కించిన ఈ మూవీ అక్టోబరు 20న విడుదల కానుంది. దీంతో బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే తాజాగా ‘ఇచ్చేసుకుంటాలే’ అంటూ సాగే మెలోడియస్‌ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. జీవి ప్రకాష్‌ సంగీతంలో భాస్కర్‌భట్ల స్వర పరిచిన ఈ పాటను సింధూరి ఆలపించగా అభిమానులను తెగ అలరిస్తోంది. ఇక రేణుదేశాయ్‌ కీలకపాత్రలో కనిపించనున్న సినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు హీరోయిన్‌లుగా నటించారు. ఇక అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ అగ‌ర్వాల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Next Story

Most Viewed