- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
చైతన్య, శోభిత దాంపత్య జీవితంపై మరో జ్యోతిష్కుడు సంచలన వ్యాఖ్యలు.. ఆమె వల్లే నాగ చైతన్య లైఫ్ అలా అవుతుందంటూ
దిశ, సినిమా: నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి హాట్ టాపిక్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వైవాహిక జీవితంపై జ్యోతిష్యం చెప్పి సంచలనంగా మారారు. అందులో భాగంగా సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరిద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై ట్రోలింగ్ మొదలైంది. కాగా తెలుగు ఫిలిం జర్నలిస్టులు ఆయన జ్యోతిష్యంపై మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ అతడికి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా చేయవచ్చనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో ఆస్ట్రాలజర్ తాజాగా ఇద్దరి దాంపత్య జీవితం ఎలా ఉండబోతుందనే విషయంపై తన అభిప్రాయాలను పంచుకొన్నారు. వివరాల్లోకి వెళితే..
బాలీవుడ్‌కు చెందిన జ్యోతిష్యుడు చెప్పిన జాతకం ప్రకారం.. వీరిద్దరి పెళ్లి 2025 సంవత్సరం మొదటి భాగంలో జరిగితే.. వారి దాంపత్య జీవితానికి ఢోకా ఉండదు. వారి సంసారం ఎలాంటి సమస్యలు లేకుండా సాగుతుంది అని చెప్పారు. అలాగే శోభితతో నాగచైతన్య పెళ్లి నిశ్చితార్థం ఆగస్టు 8వ తేదీ ఉదయం 9.42 గంటలకు జరిగింది. అలాగే న్యూమరాలజీ ప్రకారం.. 8.8.8 (అంటే 8వ తేదీ 8వ నెల (ఆగస్టు), 2+0+2+4 (2024)=8) ప్రకారం ఎంగేజ్‌మెంట్ జరిగింది. 8 అంటే అపరిమితం అని అర్థం. వారి జీవితంలో అపరిమితంగా ఆనందం, అనుబంధాలు, భావోద్వేగాలు కొనసాగుతాయి అని చెప్పాడు.
ఇక శోభితా దూళిపాళ గ్రహ సంచారం ప్రకారం.. శాస్త్రం చెప్పిందేమిటంటే.. కేవలం నాగచైతన్యతోనే ప్రేమను పంచుకోవడమే కాకుండా అక్కినేని కుటుంబంతో ఆమె అన్యోన్యంగా ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్లేలా ఆమె చేస్తుంది. దాని వల్ల నాగచైతన్యకు మానసిక ఆనందం కలుగడమే కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని లీడ్ చేసేలా చేస్తుంది అని ఉత్తరాదికి చెందిన జ్యోతిష్యుడు పండిట్ జగన్నాథ్ గురూజీ వెల్లడించారు. కేవలం శోభితా అనుసరించే ప్రవర్తన వల్లే నాగచైతన్య దాంపత్య జీవితం సవ్యంగా సాగుతుంది. వాళ్లిద్దరూ ప్రేమపక్షులుగా లైఫ్‌ను లీడ్ చేస్తారు. అలాగే ఒకరికొకరు సమస్యలను, తమ ముందు వచ్చే సవాళ్లను సరిదిద్దుకొనే అవకాశం ఉంది. కాబట్టి వారిద్దరూ తమ కాపురాన్ని ఆస్వాదిస్తారు అని గురూజీ వెల్లడించారు. ఇక వేణు స్వామి వెల్లడించిన విషయాలకు భిన్నంగా ఉండటంతో ఫ్యాన్స్‌కు కొంత ఊరటగా లభించిందనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.