- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంబలే ఫిలిమ్స్ నుంచి మరో యానిమేటెడ్ సునామీ.. ధర్మం పతనమైతే గొడ్డలి గర్జిస్తుందంటూ మేకర్స్ పోస్ట్
ధర్మం పతనమైనప్పుడు, పరశు గొడ్డలి లేస్తుంది అనే ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.

దిశ, సినిమా: కాంతార, సలార’ వంటి భారీ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న హోంబలే ఫిల్మ్స్, ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మన పురాణ గాథలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పేలా హోంబలే ఫిల్మ్స్, క్లీమ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా 'మహావతార్' అనే యానిమేటెడ్ ఫ్రాంచైజీని ప్రారంభించాయి. 2025లో వచ్చిన మొదటి భాగం ‘మహావతార్: నరసింహ’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించి, యానిమేషన్ చిత్రాల్లో కొత్త ప్రమాణాలను సెట్ చేసింది. అదే ఉత్సాహంతో ఇప్పుడు రెండో భాగంగా ‘మహావతార్ పరశురామ్’ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ధర్మం పతనమైనప్పుడు, పరశు గొడ్డలి లేస్తుంది" అనే ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది. లోకంలో అధర్మాన్ని రూపుమాపేందుకు విష్ణుమూర్తి ఎత్తిన ఆరో అవతారం పరశురాముడి గాథను, దర్శకుడు అశ్విన్ కుమార్ అంతర్జాతీయ స్థాయి విజువల్స్‌తో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ చిత్రం కేవలం పిల్లల కోసమే కాకుండా, పౌరాణిక కథలను ఇష్టపడే పెద్దలను కూడా ఆకట్టుకునేలా రూపొందుతోంది.
ఈ భారీ యానిమేటెడ్ ఎపిక్‌కు క్రేజీ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. విక్రమ్ వేద, ఖైదీ వంటి సినిమాలతో తనదైన నేపథ్య సంగీతంతో థియేటర్లను హోరెత్తించే సామ్ సి.ఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది. దాదాపు 7 సినిమాల సిరీస్‌గా రాబోతున్న ఈ 'మహావతార్' ఫ్రాంచైజీలో, పరశురాముడి గాథ అత్యంత కీలకమైనదిగా నిలవనుంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం, డిసెంబర్ 2027లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పౌరాణిక ఇతిహాసాలను, ఆధునిక యానిమేషన్ టెక్నాలజీతో చూసేందుకు సిద్ధమవుతున్న సినీ అభిమానులు, ఈ 'పరశురాముడి' యుద్ధం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన సంస్కృతిని, పురాణాలను గ్లోబల్ ఆడియన్స్‌కు పరిచయం చేసేందుకు హోంబలే ఫిల్మ్స్ చేస్తున్న ఈ ప్రయత్నంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.






