- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అన్నగారు వస్తారు’ సినిమా టీజర్ అప్డేట్.. ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ లాంచ్ చేయబోతున్నాడంటూ పోస్ట్
స్టార్ హీరో కార్తీ (Karthi)గత ఏడాది ‘సత్యం సుందరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.

దిశ, సినిమా: స్టార్ హీరో కార్తీ (Karthi)గత ఏడాది ‘సత్యం సుందరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఇక ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టారు. ఖైధీ-2, సర్దార్-2 వంటి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా త్వరలో ‘వా వాతియార్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా తెలుగులో ‘అన్నగారు వస్తారు’(AnnagaruVostaru)టైటిల్‌తో రాబోతుంది. ఈ చిత్రాన్ని ప్రెస్టీజీయస్ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో కె.ఇ జ్ఞానవేల్ రాజా (K.E. Gnanavel Raja)నిర్మిస్తుండగా.. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ‘అన్నగారు వస్తారు’ నలన్ కుమారస్వామి దర్శకత్వంలో రూపొందుతోంది.
ఇందులో కార్తీ సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా కార్తీ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పాన్ ఇండియా స్థాయిలో సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో సత్యరాజ్ , మధుర్ మిట్ట్, ఆనంద రాజ్, రాజ్ కిరణ్, శిల్పా మంజునాథ్, కరుణాకరణ్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొదలై చాలా రోజులే అవుతున్నప్పటికీ విడుదలకు నోచుకోలేదు. ఈ విషయం తెలుసుకున్న కార్తీ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే.. మూవీ మేకర్స్ ‘అన్నగారు వస్తారు’ డిసెంబర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించి కాస్త ఊరట కలిగించారు. అప్పుడే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్రబృందం ఈ సినిమా అప్డేట్ రాబోతున్నట్లు వెల్లడించారు.
నవంబర్ 28న సాయంత్రం 5:04గంటలకు ‘అన్నగారు వస్తారు’ తెలుగు టీజర్‌ను టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా లాంచ్ చేయించనున్నట్లు ప్రకటించారు. స్వాగ్ సెలబ్రేషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ అనిల్ రావిపూడి టీజర్ లాంచ్ చేయబోతున్నారు. సిద్ధంగా ఉండండి అనే క్యాప్షన్ జత చేశారు. కాగా ఈ చిత్రంతో పాటు కార్తీ తెలుగు దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వన్ ఆఫ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతున్నట్లు టాక్.ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ అభిమానుల్లో జోష్ నెలకొంది.






