బోల్డ్ సీన్లకు బ్రేక్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ.. ఎందుకో తెలుసా?

by Web Desk |
బోల్డ్ సీన్లకు బ్రేక్ చెప్పిన బాలీవుడ్ బ్యూటీ.. ఎందుకో తెలుసా?
X

దిశ, సినిమా : లేట్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకిత లోఖండే తన ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈమె 'పవిత్ర రిష్తా' సీరియల్ ద్వారా పాపులర్ కాగా.. 'సీజన్ 2' శుక్రవారం నుంచి జీ టీవీలో ప్రసారమవుతుంది. ఈ మేరకు లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. మొదటి సీజన్‌ మాదిరే ఈ సీజన్‌లోనూ బోల్డ్ సీన్లు చేశారా? అని అడిగితే.. 'పెళ్లి తర్వాత బోల్డ్ సీన్స్ చేసేందుకు నా మనసు అంగీకరించట్లేదు.

నా భర్తను ఇబ్బంది పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆయన ఫీలింగ్స్‌ కూడా అర్థం చేసుకోవాలి. అలాంటి ప్రాజెక్టుల్లో నటించడం వల్ల మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు రాలేదు కానీ తను బాధపడితే చూడలేను' అని స్పష్టం చేసింది. అంతేకాదు కెరీర్ ప్రారంభం నుంచి అటువంటి సీన్స్ చేయడం ఇష్టం లేదన్న అంకిత.. కొన్ని విషయాల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తానని, తన అభిప్రాయాలను ఎవరూ మార్చలేరంటూ ముగించింది.

https://www.instagram.com/p/CRQf06Sr_PT/?utm_source=ig_web_copy_link



Next Story

Most Viewed