Filmfare Awards 2026: అవార్డు తీసుకునేందుకు వెళ్తే అవమానం మిగిలింది.. అంజలికి తప్పని తిప్పలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-24 04:03:35  IST  )

వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన అంజలిని పట్టించుకునే వారే కరువయ్యారు

Filmfare Awards 2026: అవార్డు తీసుకునేందుకు వెళ్తే అవమానం మిగిలింది.. అంజలికి తప్పని తిప్పలు
X

దిశ, సినిమా: దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్‌ఫేర్ అవార్డు(Filmfare Awards)ల వేడుక నిర్వహణ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొత్త నటీనటులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని నిహారిక కొణిదెల ధ్వజమెత్తగా, తాజాగా టాలెంటెడ్ నటి అంజలి(Anjali)కి సైతం నిర్వాహకుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఆమెను పట్టించుకునే వారే కరువయ్యారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari)సినిమాలో తన అద్భుత నటనకు గాను అంజలి ఉత్తమ సహాయ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాన్ని అందుకోవడానికి ఆమె కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, ప్రోటోకాల్ ప్రకారం ఆమెను రిసీవ్ చేసుకోవాల్సిన ఫిల్మ్‌ఫేర్ ప్రతినిధులు ఎవరూ అక్కడికి రాలేదు. దీంతో ఆమె దాదాపు 40 నిమిషాల పాటు విమానాశ్రయంలోనే వేచి చూడాల్సి వచ్చింది.

ఎయిర్‌పోర్టులో తనను ఎవరూ పట్టించుకోవడం లేదని, కనీసం వాహనం కూడా ఏర్పాటు చేయలేదని అంజలి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఒక వ్యక్తి అంజలి పడుతున్న ఇబ్బందిని వివరిస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద ఈవెంట్‌లో కనీసం అవార్డు గ్రహీతలకు ఇచ్చే మర్యాద కూడా లేకపోవడంపై నెటిజన్లు ఫిల్మ్‌ఫేర్ యూనిట్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. నిహారిక కొణిదెల తన పోస్ట్‌లో నిర్వహణ లోపాల గురించి ప్రస్తావిస్తూ.. డెబ్యూ నటులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. ఇప్పుడు అంజలికి జరిగిన ఈ అవమానం చూస్తుంటే, ఈసారి ఫిల్మ్‌ఫేర్ నిర్వహణలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వరుసగా తలెత్తుతున్న ఈ వివాదాలపై ఫిల్మ్‌ఫేర్ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఆ సమయంలో మళ్ళీ ఎవరినైనా నమ్ముతానని అనుకోలేదు.. సమంత ఎమోషనల్ కామెంట్స్!

Next Story