డైరెక్టర్ విశాల్‌కే చురకలు అంటించిన అంజలి.. క్రేజీ వీడియో వైరల్

by Mallepaka Hamsa |

రేవులో తాటిచెట్టులా నిలబడే ఉంటావేంటీ? నేను వచ్చి చాలా సేపు అయింది.. కథ చెప్పవా?..

డైరెక్టర్ విశాల్‌కే చురకలు అంటించిన అంజలి.. క్రేజీ వీడియో వైరల్
X

దిశ, సినిమా: తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అంజలి మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చేస్తోంది. గతేడాది ‘మదగజరాజా’తో సక్సెస్ అందుకున్న ఈ భామ, ఇప్పుడు కోలీవుడ్ యాక్షన్ హీరో విశాల్‌తో మరోసారి జతకట్టబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. విశాల్ హీరోగా నటిస్తున్న 35వ ప్రాజెక్ట్ ఇది. విశేషమేమిటంటే, ఈ సినిమాకు విశాల్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఈ చిత్రానికి రవి అరసు దర్శకత్వం వహించాల్సి ఉంది, కానీ కొన్ని మనస్పర్థల వల్ల ఆయన తప్పుకోవడంతో, విశాల్ ఆ బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఆర్‌బీ చౌదరి ఈ భారీ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నారు. ఇందులో అంజలితో పాటు దుషారా విజయన్ కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను బాగా నవ్విస్తోంది.

ఇందులో అంజలి డైరెక్టర్ విశాల్‌ను ఆటపట్టించిన తీరు హైలైట్‌గా నిలిచింది. "రేవులో తాటిచెట్టులా నిలబడే ఉంటావేంటీ? నేను వచ్చి చాలా సేపు అయింది.. కథ చెప్పవా?" అని అంజలి విశాల్‌కి చురకలు అంటిస్తుంది. విశాల్ కథ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, అంజలి మధ్య మధ్యలో జోకులు వేస్తూ, అతనికి చిరాకు తెప్పిస్తుంది. అంజలి ఓవరాక్షన్ తట్టుకోలేక విశాల్ అక్కడ నుండి వెళ్ళిపోవడంతో, అంజలి ఎవరికో ఫోన్ చేసి "కథ చెప్పమంటే వెళ్ళిపోయాడు ఏంటి?" అని అడగడం భలే కామెడీగా ఉంది. ఈ సినిమాలో అంజలి కేవలం ఒక కీలక పాత్రలో మాత్రమే కనిపిస్తుందని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఈ వీడియో చూశాక, ఆమె ఇందులో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తోందని స్పష్టమైంది. విశాల్ డైరెక్షన్‌లో అంజలి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్టుపై తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. విశాల్ స్వయంగా మెగా ఫోన్ పట్టడం బాక్సాఫీస్ వద్ద ఒక రిస్క్ అని కొందరు అంటున్నా, ఈ క్రేజీ అప్‌డేట్స్‌తో సినిమాపై మంచి బజ్ క్రియేట్ అవుతోంది.

Next Story