- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ అసభ్య ప్రవర్తనపై రియాక్ట్ అయిన అంజలి.. వారు నన్ను బెదిరించారంటూ సంచలన వీడియో రిలీజ్
భోజ్‌పురి స్టార్ నటుడు పవన్ సింగ్(Pawan Singh) సింగర్‌గా నటుడిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

దిశ, సినిమా: భోజ్‌పురి స్టార్ నటుడు పవన్ సింగ్(Pawan Singh) సింగర్‌గా నటుడిగా ఫుల్ పాపులారిటీ దక్కించుకున్నాడు. పవర్ స్టార్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ఇక ఇటీవల ఓ ఈవెంట్‌లో స్టేజ్‌పై ఆయన హీరోయిన్ అంజలి(anjali) నడుమును అసభ్యంగా తాకి వివాదంలో చిక్కుకున్నాడు. పదే పదే టచ్ చేస్తూ ఆమెను ఇబ్బంది పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో అది చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు అవుతున్నప్పటికీ ఇబ్బంది పడిన హీరోయిన్ స్పందించకపోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే ఆమెకు అది నచ్చింది కావచ్చని దారుణంగా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, అంజలి ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా ఓ సంచలన వీడియోను రిలీజ్ చేసింది. ‘‘గత రెండు రోజులుగా నేను చాలా బాధపడుతున్నాను.
లక్నోలో జరిగిన ఘటనపై ఎందుకు స్పందించలేదని, చర్యలు ఎందుకు తీసుకోలేదని నాకు నిత్యం ఫోన్లు, మెసేజ్‌లు చేస్తున్నారు. కొందరు తప్పుగా అర్థం చేసుకుని నేను నవ్వుతున్నాను సరదాగా ఉన్నానని అంటున్నారు. ఎవరైనా మన అనుమతి లేకుండా శరీరాన్ని తాకితే.. మాజాగా, ఆనందంగా ఉంటుందా?. నాకు చాలా కోసం వస్తుంది బాధగా ఉంది. నేను ఈవెంట్‌లో మాట్లాడుతుండగా.. పవన్ సింగ్ నా నడుమును తాకాడు. దీంతో నేను అక్కడ ఏదైనా అంటుంకుంది కావచ్చు దానిని తీస్తున్నారని అనుకున్నాను. నేను ఆ రోజు కొత్త చీర కట్టుకున్నందుకు బ్లౌజ్ ట్యాగ్ ఏమైనా బయటకు వచ్చిందేమేనని అనుకుని నవ్వాను. కానీ అతను నన్ను కావాలనే తాకాడని గమనించలేకపోయాను. ఆ తర్వాత నాకు అనుమానం వచ్చి నా టీమ్ మెంబర్‌ను అడిగితే అక్కడ ఏమీ లేదని చెప్పడంలో షాక్ అయ్యాను.
అప్పుడు నాకు కోసంతో పాటు బాధ కలిగింది. ఈ విషయాన్ని ప్రైవేట్‌గా మాట్లాడదామని అనుకునేలోపే పవన్ సింగ్ వెళ్లిపోయారు. ఈ ఘటన గురించి బయటకు మాట్లాడితే.. పవన్ సింగ్‌కి భారీ నెట్‌వర్క్ ఉందని నన్ను కొంతమంది బెదిరించారు. ఇండస్ట్రీలో ఉండాలంటే అలాంటివి తట్టుకోక తప్పదు అని అనడంతో నేనే సైలెంట్‌గా ఉండాల్సి వచ్చింది. అక్కడితో సర్దుమణుగుతుందని అనుకున్నాను కానీ ఇంద పెద్దదిగా మారుతుందని అనుకోలేదు. ఏ అమ్మాయిని తప్పుగా తాగడం తప్పు. అలా నా ప్రాంతంలో చేస్తే.. ప్రజలే బుద్ది చెప్పేవారు. నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఒకమై భోజ్‌పురి చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు’’ అని చెప్పుకొచ్చింది. ఇక అది చూసిన నెటిజన్లు ఆమెకు ధైర్యం చెబుతూ సపోర్ట్‌గా నిలుస్తున్నారు.






