టికెట్ల రేట్లను ఉల్లితో పోల్చిన అనిల్ సుంకర.. సంచలనంగా మారిన కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-07 04:25:45  IST  )

టాలీవుడ్‌లో ఇటీవల కాలంగా సినిమా టికెట్ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

టికెట్ల రేట్లను ఉల్లితో పోల్చిన అనిల్ సుంకర.. సంచలనంగా మారిన కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఇటీవల కాలంగా సినిమా టికెట్ ధరల పెంపుపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుతూ మేకర్స్ ప్రేక్షకులకు షాక్ ఇస్తున్నారు. దీనికి ప్రభుత్వాల నుంచి అనుమతులు రావడంతో ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు ప్రేక్షకులు, సినీ అభిమానులు దీనిపై విమర్శలు చేస్తుండగా.. మరోవైపు నిర్మాతలు తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. టికెట్ ధరల పెంపును ఆయన ఉల్లిపాయ ధరలతో పోల్చడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. “కొన్ని సీజన్లలో ఉల్లిపాయ ధరలు విపరీతంగా పెరుగుతాయి.

అయినా వాటిపై పెద్దగా చర్చలు జరగవు. ప్రజలు అదే ధరలకు కొనుగోలు చేస్తారు, ఆ పరిస్థితులకు అలవాటు పడతారు. కానీ సినిమాల టికెట్ ధరలు అప్పుడప్పుడు పెరిగితే మాత్రం పెద్ద ఎత్తున డిబేట్స్ జరుగుతాయి” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీశాయి. టికెట్ రేట్లను నిత్యావసర వస్తువుతో పోల్చడాన్ని నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వ్యాఖ్యలు తెలిసిన వెంటనే సోషల్ మీడియాలో అనిల్ సుంకర్‌ను ట్రోల్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకుల భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా మాట్లాడారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇక అనిల్ సుంకర(Anil Sunkara) విషయానికి వస్తే.. ఆయన ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఇప్పటికే పలు సినిమాలను నిర్మించారు. తాజాగా ఈ బ్యానర్‌లో రూపొందుతున్న ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చార్మింగ్ స్టార్ శర్వానంద్(Sharwanand), దర్శకుడు అబ్బరాజు కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానుంది. ఇందులో శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది.

Read More..

శర్వా నంద్ 'నారి నారి నడుమ మురారి' నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్

Next Story