బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అనిల్ రావిపూడి.. వైరల్ వీడియో

by Disha Web Desk 7 |
బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన అనిల్ రావిపూడి.. వైరల్ వీడియో
X

దిశ, సినిమా: టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్య కథానాయకుడిగా #NBK108 మూవీని తెరకెక్కిస్తున్నాడు. మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న క్రమంలో తాజాగా యాక్షన్ సీక్వెన్స్ కంప్లీట్ చేశారు. ఇందుకు సింబాలిక్‌గా ఓ రీల్ చేసి చూపించాడు అనిల్ రావిపూడి. ఫైట్ మాస్టర్‌తో పని అయిపోయింది అంటూ బాలయ్య పాత చిత్రం ‘లారీ డ్రైవర్’ లోని ‘నట్టు లూజు దానా బాలయ్య, బాలయ్య.. ఫిట్టు చేయరానా’ అనే పాటకు చిందులు వేశారు. ఈ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. వీడియో చూసిన బాలయ్య ఫ్యాన్స్ ‘హీరోగా ట్రై చేయొచ్చు కదా’ అంటూ దర్శకుడికి సలహా ఇస్తున్నారు.

Next Story