- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కిల్లర్’ టీజర్ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి.. అందరూ సపోర్ట్ చేయాలంటూ రిక్వెస్ట్
తాజాగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘కిల్లర్’ టీజర్ రిలీజ్ చేశారు

దిశ, సినిమా: జ్యోతి పూర్వజ్(Jyoti Purvaj), పూర్వాజ్(Purvaj)ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘కిల్లర్’(Killer). మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది. తాజాగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘కిల్లర్’ టీజర్ రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కిల్లర్ మూవీ టీజర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. సై ఫై థ్రిల్లర్ జానర్స్ కలిపి ఈ సినిమాను బాగా రూపొందించారు. జ్యోతి గారి ట్రాన్సఫర్మేషన్ షాకింగ్ గా ఉంది. యాక్షన్ బాగా చేశారు. కిల్లర్ సినిమాకు మీరంతా సపోర్ట్ చేయాలని కోరుతున్నా’’ అని అన్నారు. హీరోయిన్ జ్యోతి పూర్వజ్ చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడంలో అనిల్ గారు ముందుంటారని ఆయనకు థ్యాంక్స్ చెప్పింది.






