భారీ బయోపిక్‌లో క్రికెట్ క్వీన్‌గా అనీత్ పడ్డా.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్!

by Mallepaka Hamsa |

వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌లో ఉన్న అనీత్‌కు స్మృతి మంధాన బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.

భారీ బయోపిక్‌లో క్రికెట్ క్వీన్‌గా అనీత్ పడ్డా.. చర్చనీయాంశంగా మారిన పోస్ట్!
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనీత్ పడ్డా ‘సయ్యారా’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చారు. ఇక ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో అమ్మడు క్రేజ్ భారీగా పెరిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయిన అనీత్ పడ్డా వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు. పవర్‌ఫుల్ సబ్జెక్ట్‌తో రాబోతున్న ‘శక్తి శాలిని’ చిత్రంలో ఆమె డబుల్ రోల్ ప్లే చేయనుంది. దీంతో పాటు లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ మోహిత్ సూరి దర్శకత్వంలో ఓ సరికొత్త రొమాంటిక్ కామెడీ ప్రాజెక్ట్ కూడా ఉంది. ఈక్రమంలో.. తాజాగా, అనీత్ పడ్డాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వరుస చిత్రాలతో ఫుల్ జోష్‌లో ఉన్న అనీత్‌కు స్మృతి మంధాన బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినట్లు నెట్టింట పలు పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ సైలెంట్‌గా జరుగుతోందని టాక్.

క్రీడా నేపథ్యంతో వచ్చే బయోపిక్‌లకు భారతీయ సినిమాలో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా స్మృతి మంధానకు దేశవ్యాప్తంగా పురుషుల క్రికెటర్లతో సమానంగా భారీ ఫాలోయింగ్ ఉంది. మైదానంలో ఆమె సాధించిన రికార్డులు, క్రికెట్ ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, భారత మహిళా క్రికెట్‌ను ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ఆమె చేసిన కృషి వంటి అనేక ఆసక్తికరమైన అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారట. బాలీవుడ్‌లో ఇటీవలి కాలంలో రాబోతున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో ఇది అత్యంత భారీ చిత్రంగా నిలిచే అవకాశం ఉందని సినీ ప్రియులు భావిస్తున్నారు. క్రికెట్, సినిమా లవర్స్‌ను ఆకట్టుకునేలా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడి కానున్నాయి.

Next Story