‘ఆంధ్రాకింగ్ తాలూకా’ థర్డ్ సింగిల్ అప్డేట్.. అంతకు మించి ఉండబోతుందంటూ హైప్ పెంచిన మేకర్స్

by Mallepaka Hamsa |

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) హీరోగా, పి. మహేష్ బాబు(mahesh babu) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(andra king thaluka).

‘ఆంధ్రాకింగ్ తాలూకా’ థర్డ్ సింగిల్ అప్డేట్.. అంతకు మించి ఉండబోతుందంటూ హైప్ పెంచిన మేకర్స్
X

దిశ, సినిమా: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(ram pothineni) హీరోగా, పి. మహేష్ బాబు(mahesh babu) దర్శకత్వంలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’(andra king thaluka). ఈ సినిమాను అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని. రవిశంకర్ నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌లో 22వ సినిమాగా రాబోతుండగా.. ఇందులో భాగ్య శ్రీ(bagya shri borse) బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను నవంబర్ 28న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈక్రమంలో.. ప్రమోషన్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తున్నారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన థర్డ్ సింగిల్ రాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. అక్టోబర్ 31న ‘ఈ చిన్ని గుండెలో’ అని సాగే పాటను విడుదల చేయబోతున్నట్లు తెలుపుతూ రామ్, భాగ్యశ్రీ బోర్సేను ఎత్తుకున్న పోస్టర్‌తో ప్రేక్షకులను మ్యాజిక్ చేశారు. ఇప్పటివరకు రెండు సాంగ్స్ విడుదల కాగా.. వాటిని మించి పాట చార్ట్ బస్టర్‌గా నిలవనున్నట్లు చిత్రబృందం నమ్మకంగా ఉంది. అద్భుత కథలా అనిపించే పాట రాబోతున్నట్లు తెలిపారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ పాటపై హైప్ పెరిగింది.

link

Next Story