హైపర్ ఆదితో యాంకర్ వర్షిణి పెళ్లి.. క్లారిటీ!

by Disha Web Desk 9 |
హైపర్ ఆదితో యాంకర్ వర్షిణి పెళ్లి.. క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది.. యాంకర్ వర్షిణి మధ్య లవ్ ఎఫైర్ ఉందంటూ గత కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు పుకార్లు వినిపించాయి. తాజాగా ఈ విషయంపై వర్షిణి స్పందించి.. ‘‘చాలా రోజుల నుంచి ఆదితో పెళ్లి ఎప్పుడని ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. అస్సలు రియాక్ట్ కావొద్దని అనుకున్నాను. కానీ అవ్వక తప్పడం లేదు. ఒక్కసారి జనాలకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెబుతున్నా. ఆ రూమర్స్ నిజం కాదు. అదంతా ఫేక్ న్యూస్. అలాంటి ఆలోచనే లేదు.’’ అంటూ వర్షిణి తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ యాంకర్ ఫ్యాన్ ఒకరు మనం పెళ్లి చేసుకుందామా వర్షిణి? అని అడిగాడు. ‘మా అమ్మని అడగాలి.’ అని హాట్ యాంకర్ బదులివ్వడంతో ప్రస్తుతం ఈ భామ క్యూట్ ఆన్సర్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.



Next Story