Sreemukhi :అందం కోసం అటువంటి పనులు చేస్తున్న యాంకర్ శ్రీముఖి..!

by Disha Web Desk 9 |
Sreemukhi :అందం కోసం అటువంటి పనులు చేస్తున్న యాంకర్ శ్రీముఖి..!
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అమ్మాయిలంటేనే అందంపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇక వెండితెర, బుల్లితెర హీరోయిన్స్, ఫిమేల్ ఆర్టిస్టుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. నిత్యం అందం కోసమే పరితపిస్తూ ఉంటారు. ముఖ్యమైన పనులు వదిలేసుకుని మరీ పార్లర్‌కు వెళ్తారు. గంటల తరబడి జిమ్‌లో వర్కౌట్లు చేస్తారు. ప్రస్తుతం వరుస షోలతో ఓ రేంజ్‌లో హడావుడి చేస్తున్న స్టార్ యాంకర్ శ్రీముఖి జిమ్, పార్లర్‌కు వెళ్లకుండా యోగా చేస్తుందట. ప్రతిరోజూ కచ్చితంగా వాకింగ్‌, ఆహారంతో పాటు పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకుందట. తిన్న వెంటనే ఒక 20 నిమిషాల పాటు మళ్లీ వాకింగ్ చేస్తుందట. అలాగే నాన్‌వెజ్ కూడా ఫుల్‌గా తింటుందని తెలుస్తోంది. అందం కోసం ఇంగ్లీష్ ప్రొడక్ట్స్ లాంటివి ఏమి వాడడం లేదని కేవలం ఇంటి చిట్కాలు మాత్రమే వాడుతుందని సమాచారం.

Read more: Sreemukhi :రూటు మార్చిన శ్రీముఖి.. ఎందుకో తెలుసా?


Next Story