ఇండ్రస్టీలో హాట్ టాపిక్.. రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..?

by Web Desk |
ఇండ్రస్టీలో హాట్ టాపిక్.. రహస్యంగా పెళ్లి చేసుకున్న యాంకర్ రష్మీ గౌతమ్..?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. బుల్లితెర కమీడియన్, యాంకర్ సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్‌ నడిపి రష్మీ.. చాలా ఫేమస్ అయింది. అంతే కాకుండా జబర్దస్త్, ఢీ షోలలో యాంకర్‌గా చేసి మరింత పేరు సంపాదించుకుంది. హీరోయిన్‌గా కొన్ని సినిమాలలో చేసినప్పటికి దాంట్లో అంతా సక్సెస్ అవ్వలేదు. ఇదిలా ఉంటే మీడియాలో రష్మీ గురించి మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అదేంటంటే లాక్ డౌన్‌లో రష్మీ రహస్యంగా వివాహం చేసుకుందని నెట్టింట్లో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అసలు ఇండస్ట్రీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. సుధీర్, రష్మీలు తమ మధ్య ఏమీలేదని.. తాము స్నేహితులం అని ఎన్నోసార్లు చెప్పారు. అయినప్పటికి వీరి మధ్య ఏదో ఉందని పుకార్లు వచ్చాయి. కాగా ప్రస్తుతం రష్మీ అసలు ఇండస్ర్టీతో సంబంధం లేని వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు పుకార్లు వినిపిస్తు్న్నాయి. మరి పెళ్లి చేసుకుని రహస్యంగా ఉంచడానికి కారణం.. పెళ్లి జరిగినట్లు తెలిస్తే అవకాశాలు రావని కావాలనే రష్మీ పెళ్లి మ్యాటర్ గోప్యంగా ఉంచుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed