- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సుడిగాలి సుధీర్‌తో యాంకరమ్మ ప్రేమాయణం.. ఇన్‌స్టా పోస్ట్‌తో అసలు విషయం రివీల్
సుధీర్, లేడీ యాంకర్ దీపికా పిల్లి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ కలిసి విదేశాల్లో విహరిస్తున్నారని ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది.

దిశ, సినిమా: బుల్లితెరపై తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ గురించి ఏ చిన్న వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఆయన పెళ్లి, ప్రేమ వ్యవహారాల గురించి నెట్టింట నిత్యం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా సుధీర్, లేడీ యాంకర్ దీపికా పిల్లి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ కలిసి విదేశాల్లో విహరిస్తున్నారని ఒక ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొట్టింది. స్వయంగా దీపికా పిల్లి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచే ఆ ఫోటో షేర్ అవ్వడంతో, సుధీర్ అభిమానులంతా ఇది నిజమేనని నమ్మేశారు. ఈ వార్త వైరల్ అవ్వడంతో దీపికా పిల్లి వెంటనే స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని, ఆ ఫోటోతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది. "నా ఇన్‌స్టా ఖాతా హ్యాక్ అయింది. గత రాత్రి నా స్టోరీలో కనిపించిన ఫోటో AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా సృష్టించబడింది.
నా అనుమతి లేకుండా ఎవరో దాన్ని పోస్ట్ చేశారు. గత 24 గంటలుగా నా ఖాతాలో వస్తున్న ఏ కంటెంట్‌తోనూ నాకు సంబంధం లేదు" అని ఆమె స్పష్టం చేసింది. ఈ సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నానని చెబుతూ.. సదరు ఫోటోను ఎవరూ షేర్ చేయొద్దని దీపికా అభిమానులను కోరింది. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని, AI టెక్నాలజీని ఉపయోగించి సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల మీద ఇలాంటి దాడులు చేయడం బాధాకరమని ఆమె పేర్కొంది. దీంతో సుధీర్, దీపికా మధ్య ఏదో ఉందంటూ వస్తున్న రూమర్లకు ఒక్కసారిగా చెక్ పడింది. ఇటీవల కాలంలో చాలామంది హీరోయిన్లు ఇలాంటి 'డీప్ ఫేక్' ఫోటోల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు దీపికా పిల్లి కూడా అదే తరహాలో సైబర్ నేరగాళ్ల బారిన పడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. సాంకేతికతను మంచి కోసం వాడాల్సింది పోయి, ఇలా ఇతరుల పరువు తీయడానికి వాడటంపై నెటిజన్లు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






